Kavitha: ఢిల్లీ హైకోర్టుకు కవిత..?
ABN , Publish Date - May 07 , 2024 | 04:12 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha) ట్రయల్ కోర్టు రౌస్ అవెన్యూలో చుక్కెదురైన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దాంతో హైకోర్టును ఆశ్రయించాలని కల్వకుంట్ల కవిత భావిస్తున్నారు. బుధవారం (రేపు) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో కవిత సవాల్ చేస్తారు. పిటిషన్ విచారణకు స్వీకరణ, వాదనలు వినే అంశంపై బుధవారం స్పష్టత రానుంది.
లిక్కర్ స్కామ్ కేసులో ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో కవిత తరఫు న్యాయవాదులు విన్నవించారు. అయినప్పటికి ఫలితం లేదు. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత స్టార్ క్యాంపెయినర్ కవిత తరఫు న్యాయవాదులు వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందనే విషయాన్ని పేర్కొన్నారు.
లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైలులో ఉండగానే ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 22వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ మీద వాదనలు జరిగాయి. తీర్పును మే 2వ తేదీకి.. తర్వాత 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Read Latest News and Telangana News Here