Share News

ABN Effect: ఆస్పత్రికి చేరుకున్న మత్తు డాక్టర్

ABN , Publish Date - Oct 14 , 2024 | 07:47 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో కరీంనగర్ అధికారుల్లో కదలిక వచ్చింది. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి వైద్య బృందాన్ని పంపించారు.

ABN Effect: ఆస్పత్రికి చేరుకున్న మత్తు డాక్టర్
ABN Andhra Jyothy Effect

హుజురాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో కరీంనగర్ జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. హుజురాబాద్‌లో గర్బిణీలు పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేసింది. దీంతో జిల్లా అధికారులు స్పందించారు. హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి మత్తు డాక్టర్, ఇతర వైద్యులు సిబ్బంది చేరుకున్నారు. వైద్యులు రావడంతో గర్బిణీల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు.


ఏం జరిగిందంటే..

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో మత్తు ఇచ్చే వైద్యుడు లేరు. అయినప్పటికీ సీజేరియన్ కోసం సిద్ధం చేశారు. యూరిన్ కేథటర్ వేసి సిద్ధంగా ఉంచారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మత్తు డాక్టర్ కోసం ఎదురు చూశారు. ఆరుగురు గర్బిణీలు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక మహిళకు పురిటి నొప్పులు కూడా వచ్చాయి. విషయం తెలిసిన ఏబీఎన్ వరస కథనాలు ప్రసారం చేసింది. ఆ విషయం జిల్లా యంత్రాంగానికి తెలిసింది. వెంటనే హుజురాబాద్ ఆస్పత్రికి సిబ్బందిని పంపించింది.

abn.jpg


ఆస్పత్రికి వైద్యులు

ఏబీఎన్ కథనాలు ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. బాధ్యులపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దాంతో వెంటనే హుజురాబాద్ ఏరియా ఆస్పత్రికి మత్తు డాక్టర్‌తో పాటు గైనకాలజిస్ట్, పిడియాట్రిషీయన్ వచ్చారు. ఆస్పత్రిలో ఉన్న గర్బిణీలకు సిజేరియన్ ప్రారంభించారు. వైద్యులు రావడంతో గర్బిణీల కుటుంబ సభ్యుల ఆందోళన తగ్గింది. ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ లాంటి వారిని పట్టించుకోరా అని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: గుండెల్ని మెలిపెట్టే ఘటన.. రోడ్డుపై టీవీఎస్‌ పైనే పడుకున్న వ్యాపారి.. ఏమైందా అని చూడగా..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 14 , 2024 | 08:04 PM