TG News: మా భర్తలతో అలాంటి పనులు చేయిస్తారా.. పోలీసు భార్యల ధర్నా
ABN , Publish Date - Oct 24 , 2024 | 11:33 AM
Telangana: తెలంగాణలో పోలీసు భార్యలు ధర్నాకు దిగడం హాట్ టాపిక్ మారింది. తమ భర్తలతో వేరే పనులు చేయిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. మా భర్తలను కుటుంబానికి దూరం చేస్తున్నారంటూ పోలీసు భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 24: సమాజంలో శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలు జరుగక్కుండా, నేరాలను నిరోధించడం, దర్యాప్తు చేయడమే పోలీసుల (Telangana Police) బాధ్యత. చట్టాలను గౌరవిస్తూ తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తుంటారు పోలీసులు. ఎక్కడ, ఏ సమస్య ఉన్నా , గొడవ జరిగినా పోలీసులు అక్కడకు చేరుకుని గొడవలు తారాస్థాయి చేరుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చూసుకుంటారు. సాధారణ ఉద్యోగుల్లా పోలీసులకు ఒక సమయం అంటూ ఏదీ ఉండదు.
Rainfall Prediction: మన ఊర్లో వర్షం 5రోజుల ముందే తెలుసుకోవచ్చు!
24 గంటలూ ఆన్ డ్యూటీలో ఉంటారు కాప్స్. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వారి విధుల్లో పాల్గొనేందుకు పరిగెత్తుతుంటారు. భార్యా, పిల్లలను వదిలి డ్యూటీనే ప్రధమంగా భావిస్తుంటారు ఖాకీలు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం పోలీసులతో వారి వృత్తిని కాకుండా ఇంకా ఎన్నో పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు వారి సతీమణులు. వారికి కేవలం పోలీసు డ్యూటీ మాత్రమే వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ భర్తలకు వేరే పనులు కేటాయించడం వల్ల మాకు దూరం అవుతున్నారంటూ భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం చేయాలంటూ రెడ్డెక్కి ధర్నాకు దిగారు పోలీసు భార్యలు.
Viral Video: ఏటీఎంలో డబ్బులు బయటికి రాగానే ఆనందం తట్టుకోలేక.. ఈ యువతి చేసిన నిర్వాకం చూడండి..
రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..
గురువారం ఉదయం జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో 17వ బెటాలియన్ పోలీసు భార్యలు రోడ్డెక్కడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నడూ చూడని విధంగా పోలీసు భార్యలు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. ‘‘భర్తలకు డ్యూటీలు వేసి మాకు, మా సంసారాన్ని కుటుంబానికి దూరం చేస్తున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘మా భర్తలను లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారు’’ అని ఆందోళనకు దిగారు. పోలీసు డ్యూటీకి తమ భర్తలు చేస్తున్న పనికి సంబంధం లేదని భార్యలు చెబుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసు భార్యలు రోడ్డెక్కడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రోడ్డెక్కిన పోలీసు భార్యలను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే మహిళలను అరెస్ట్ చేసి 17వ బెటాలియన్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Pongulati: ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలతాయి!
Winter Offer: వింటర్ ఆఫర్స్.. అతి తక్కువ ధరకే టాప్ 5 స్మార్ట్ గీజర్స్..
Read Latest Telangana News And Telugu News