Share News

Bhatti Vikramarka: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భట్టి

ABN , Publish Date - Jun 24 , 2024 | 06:36 PM

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) దంపతులు ఈరోజు(మంగళవారం) దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు.

Bhatti Vikramarka: శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న భట్టి
Deputy CM Mallu Bhatti Vikramarka

నంద్యాల: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) దంపతులు ఈరోజు(మంగళవారం) దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం వెంట దర్శనంలో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ కు చెందిన నాలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

BHATTI-2.jpg


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని రుతుపవనాలు మెండుగా రావాలని కరువు, కాటకాలు లేకుండా చూడాలని పంటలు బాగా పండాలని మల్లన్నస్వామిని వేడుకున్నానని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం అధికారులతో విద్యుత్ ఉత్పత్తిపై చర్చించడానికి శ్రీశైలం వచ్చానని చెప్పారు.

BHATTI-3.jpg


శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని, గొప్ప ప్రాజెక్టు కట్టిన ఆనాటి నాయకులు స్మరిస్తూ ధన్యవాదాలు చేశానని అన్నారు. శ్రీశైలం ఎడమగట్టు హైడల్ పవర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి కొరత లేకుండా కావలసిన చర్యలు ఇప్పటికే చేపట్టామన్నారు, భవిష్యత్తులో 2029-30 వరకు విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

BHATTI-4.jpg

Updated Date - Jun 24 , 2024 | 06:38 PM