Share News

Farmers health issue:: అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలకు అస్వస్థత..

ABN , Publish Date - Aug 18 , 2024 | 06:44 PM

తల్లాడ మండలం అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు.

Farmers health issue:: అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలకు అస్వస్థత..

ఖమ్మం: తల్లాడ మండలం అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు. బాధితులను హుటాహుటిన కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నూతనకల్‌కు చెందిన వీరంతా పనుల నిమిత్తం అన్నారుగూడెం వెళ్లారు. అయితే మందు చల్లే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వేసవిని తలపిస్తున్న ఎండలకు కూలీలంతా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు కల్లూరు వైద్యులు వెల్లడించారు.


అయితే రైతులు, రైతు కూలీలు పొలాల్లో మందు కొట్టే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒంటిపై మందు పడకుండా శరీరం మెుత్తం ప్రత్యేకమైన వస్త్రాలతో కప్పుకోవాలని చెప్తున్నారు. అలాగే శ్వాస ద్వారా మందు లోపలికి వెళ్లి కళ్లు తిరగడం, వాంతులు లేదా తల తిరగడం వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉందని, కాబట్టి ముక్కు ద్వారా మందు లోపలికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Aug 18 , 2024 | 06:44 PM