Share News

Minister Thummala: ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తాం.. మహిళలు ముందుకు రావాలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 10:46 AM

మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.

Minister Thummala: ప్రభుత్వ ప్రోత్సాహం కల్పిస్తాం..  మహిళలు ముందుకు రావాలి

ఖమ్మం: మిద్దె తోటలకు తమ ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెనింగ్ ఫౌండర్ హర్కర శ్రీనివాస్ సరోజ ఆధ్వర్యంలో ఇవాళ(ఆదివారం) సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... పురుగు మందులు లేని కూరగాయల సాగును మిద్దె తోటల్లో చేయాలని సూచించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా మిద్దె తోటల్లో కూరగాయల సాగుతో ఆ కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు. టెర్రస్ గార్డెనింగ్ సామాజిక ఉద్యమంగా సాగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.


కాగా.. మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనాలన్నా భయం.. రసాయనాలతో పండించిన పంట ఆరోగ్యానికి చేటు చేస్తుందని టెన్షన్. అందుకే ఇంట్లోనే ఎంచక్కగా నచ్చిన వాటిని కొందరు పండిస్తున్నారు. హైదరాబాద్‌, తెలంగాణలోని పలు జిల్లాలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యానశాఖ అధికారులు కూడా అర్బన్ ఫార్మింగ్‌పై దృష్టి పెట్టారు. మిద్దెలమీద సాగుకు జనం జై కొట్టేలా అధికారులు ప్రొత్సహిస్తున్నారు. ప్రజలకు హార్టీ కల్చర్ డిపార్ట్ మెంట్ అవగాహన కల్పిస్తోంది. నాంపల్లిలో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను కూడా ప్రారంభించింది. గత కొన్నేళ్లుగా టెర్రస్ గార్డెనింగ్‌పై ఔత్సాహికులకు శిక్షణ ఇస్తోంది. ప్రతి శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వాట్సాప్ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Updated Date - Nov 24 , 2024 | 10:47 AM