Tirumala: జూలైలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ వివరాలు ఇవీ...
ABN , Publish Date - Aug 02 , 2024 | 10:51 AM
Andhrapradesh: తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జూలై మాసంలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ద్వారా శ్రీవారికీ రూ.125కోట్ల 35లక్షలను భక్తులు కానుకల రూపంలో సమర్పించారన్నారు. కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని... 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాని స్వీకరించారని వెల్లడించారు అలాగే 8.67 లక్షల మంది భక్తులు తలనీలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
తిరుమల, ఆగస్టు 2: తిరుత్తణిలో టీటీడీ (TTD) భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Syamalarao) తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జూలై మాసంలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ద్వారా శ్రీవారికీ రూ.125కోట్ల 35లక్షలను భక్తులు కానుకల రూపంలో సమర్పించారన్నారు. కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని... 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాని స్వీకరించారని వెల్లడించారు అలాగే 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను కుదించామన్నారు.
Amaravati: నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు
అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మారుస్తామన్నారు. తిరుమల్లో అత్యాధునాతన మైనా ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దళరీలను అరికట్టడంలో భాగంగా పదే..పదే టిక్కెట్లు పొందుతున్న 40 వేల మంది ఐడీలను బ్లాక్ చేసినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇస్తామన్నారు. ప్రసాదాల తయారీకి వినియోగించేందుకు నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు పేర్కొన్నారు.
వైపు తిరుమల శ్రీవారిని దర్శంచుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. వారంతరాల్లో ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. శ్రీనివాసుడిని దర్శంచుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటారు. క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అన్ని సౌకర్యాలను అందజేస్తుంది. ఆహారం, తాగు నీరు ఇలా సదుపాయాలు కల్పిస్తుంటుంది. తిరుమల శ్రీవారి కోసం దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అలాగే భారీగా కానుకలను సమర్పిస్తుంటారు. భక్తులు తలనీలాలు సమర్పిస్తుంటారు. తిరుమల వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
MRPS: ఎంఆర్‌పీఎస్ పోరాటానికి ధర్నాచౌక్ అడ్డా..
18 కాంపార్ట్‌మెంట్లలో...
కాగా.. ఈరోజు (శుక్రవారం) తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్‌లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది. అలాగే నిన్న తిరుమల శ్రీవారిని 61,465 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,206 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ పద్వారా రూ. 3.66 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest AP News And Telugu News