Share News

CM Revanth Reddy: రేవంత్‌తో కేకే భేటీ.. రాజకీయ వర్గాల్లో కలకలం

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:59 AM

సీఎం రేవంత్‌ రెడ్డితో బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు భేటీ అయ్యారు. కేకే నిన్న బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. చనిపోయే వరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని కేకే తెలిపారు.

CM Revanth Reddy: రేవంత్‌తో కేకే భేటీ.. రాజకీయ వర్గాల్లో కలకలం

హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)తో బీఆర్ఎస్ (BRS) రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు(Keshava Rao) భేటీ అయ్యారు. కేకే నిన్న బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. చనిపోయే వరకూ కాంగ్రెస్‌ (Congress)లోనే ఉంటానని కేకే తెలిపారు. రేపు ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనుండటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం ప్రారంభమైంది. ముందుగా ఆయన కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరతారని.. ఆమె చేరిన తర్వాత కేకే పార్టీ మారే అవకాశం ఉందంటూ తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆమె కంటే ముందుగానే రేవంత్‌తో కేకే భేటీ అవడం గమనార్హం.

Phone Tapping Case: ఆయన ఆదేశాలతోనే పని చేశా: ఇన్‌స్పెక్టర్ కీలక సమాచారం

కాంగ్రెస్‌(Congress) లో చేరడంపై బీఆర్ఎస్ (BRS) రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు(Keshava Rao) కీలక తాజాగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ తనకు సొంత ఇల్లులాంటిదని చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని.. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. 53ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. బీఆర్ఎస్‌లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ (Telangana) కోసమే బీఆర్ఎస్‌లో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని కేశవరావు తేల్చిచెప్పారు.

KTR: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు ఏం చేయలేవు..

తాను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్‌లోనేనని... ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను బీఆర్ఎస్‌కు ఇంకా రిజైన్ చేయలేదన్నారు. తన కూతురు కాంగ్రెస్‌లో చేరిన రోజు.. తాను ఆ పార్టీలో చేరట్లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారు అయిన తర్వాత తానే చెబుతానని అన్నారు. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉండాలని అనుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy) కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు స్పష్టం చేశారు.

Crime: రంగారెడ్డి జిల్లా: కాటేదాన్‌లో దారుణం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - Mar 29 , 2024 | 12:00 PM