Lok Sabha Elections 2024: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి కోనేరు బ్రదర్స్
ABN , Publish Date - Apr 27 , 2024 | 03:28 PM
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని (Koneru Chinni) కూడా శనివారం నాడు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం: లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని (Koneru Chinni) కూడా శనివారం నాడు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. కోనేరు చిన్నితో పాటు ఆయన బ్రదర్ కోనేరు పూర్ణ చందర్‌రావు కూడా గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కోనేరు బ్రదర్స్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ సాదరంగా ఆహ్వానించారు.
మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా కోనేరు చిన్ని రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా.. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు చిన్ని పనిచేసిన విషయం తెలిసిందే.
Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌లో కోనేరు చిన్ని చేరారు. అయితే బీఆర్ఎస్‌లో చేరే ముందు కీలక పదవులు ఇస్తానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో గులాబీ పార్టీపై కోనేరు చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ పార్టీని కోనేరు బ్రదర్స్ వీడారు. బీఆర్ఎస్ పెద్దల వైఖరి నచ్చక కాంగ్రెస్‌లో చేరినట్లు కోనేరు బ్రదర్స్ తెలిపారు.
కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు
వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం మధ్యాహ్నం సుమారు 100మంది నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని.. తమ జిల్లాను సైతం సంపూర్ణంగా అభివృద్ధి చేస్తుందన్న నమ్మకంతోనే తాము ఈ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పారు
TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం
Read Latest Telangana News or Telugu News