KTR Budget Criticism: పింఛన్ల పెంపు మాటే లేదు: కేటీఆర్
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:43 AM
ప్రభుత్వం ప్రకటించిన 2024-25 బడ్జెట్‌లో వయోవృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇచ్చే పింఛను పెంపు మాటేలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలకు సంబంధించిన అంశమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్, జూలై25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన 2024-25 బడ్జెట్‌లో వయోవృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇచ్చే పింఛను పెంపు మాటేలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలకు సంబంధించిన అంశమే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ‘దోకేబాజ్ బడ్జెట్’ అంటూ ఆయన విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌పై గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
బడ్జెట్‌లో ఎటువంటి విధానాలు పాటించలేదని, 6గ్యారెంటీల అమలును ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధ చూపలేదని, మౌలిక వసతులకు ఏమాత్రం నిధులు కేటాయించలేదని అన్నారు. నేతన్నలు, ఆటో డ్రైవర్లకు అండా దండా చూపని దండగమారి బడ్జెట్ ఇదని విమర్శించారు.