Share News

Vikarabad: భూమి అమ్మాలని బెదిరిస్తున్నాడు.. లేదంటే చంపేస్తానంటున్నాడు!

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:50 AM

ఉమర్‌ఖాన్‌ అనే భూకబ్జాదారు తన మేన కోడలు, సోదరుడికి చెందిన భూమిని అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చెన్‌గోముల్‌కు చెందిన నరే్‌షకుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

Vikarabad: భూమి అమ్మాలని బెదిరిస్తున్నాడు.. లేదంటే చంపేస్తానంటున్నాడు!

  • పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

  • ప్రజావాణిలో వికారాబాద్‌ వాసి ఫిర్యాదు

వికారాబాద్‌, బేగంపేట, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉమర్‌ఖాన్‌ అనే భూకబ్జాదారు తన మేన కోడలు, సోదరుడికి చెందిన భూమిని అమ్మాలని దౌర్జన్యం చేస్తున్నాడని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చెన్‌గోముల్‌కు చెందిన నరే్‌షకుమార్‌ శుక్రవారం హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. చెన్‌గోముల్‌లో తన మేనకోడలు, తన సోదరుడి పేరిట ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ఆ భూమిపై కన్నేసిన ఉమర్‌ఖాన్‌ తనకు భూమిని అమ్మాలని ఆరేళ్లుగా బెదిరిస్తున్నారని, లేదంటే తమను చంపేస్తామంటున్నాడని ప్రజావాణి అధికారులకు తెలిపారు.


ఉమర్‌ఖాన్‌పై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఉమర్‌ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ భూమిలో అర ఎకరా తీసుకునైనా న్యాయం చేయాలని అధికారులను కోరారు.


నర్సరీ తొలగించాలంటూ ఫిర్యాదు

‘రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూమి అని ఉంది... వెంచర్‌ వేసినప్పుడు ఎఫ్‌టీఎల్‌ లేదు.. రికార్డుల్లో అప్పుడు లేని ప్రభుత్వ భూమి ఇప్పుడెలా అవుతుంది’ అంటూ బేగంపేట మాతాజీనగర్‌ సమీపంలోని ప్రైడ్‌ ఇండియా వెంచర్‌లో ప్లాట్లు కొన్న బాలాజీనగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఈ వెంచర్‌లో ఉన్న ఇళ్లను నోటీసులు ఇవ్వకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేయడమేకాకుండా ఆ స్థలంలో జీహెచ్‌ఎంసీ నర్సరీ ఏర్పాటు చేయడంతో వెంచర్‌లో ప్లాట్లు కొన్న యజమానులు ప్రజావాణికి వచ్చారు. ఈ స్థలానికి చెందిన రెవెన్యూ రికార్డులను అధికారులకు అందజేశారు. తమ స్థలంలోని జీహెచ్‌ఎంసీ నర్సరీని వెంటనే తొలగించేలా అధికారులను ఆదేశించాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 03:50 AM