Share News

DRDO: కాళ్లకల్‌లో అధునాతన మెషిన్‌ గన్స్‌ తయారీ

ABN , Publish Date - Oct 01 , 2024 | 04:33 AM

డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్‌ ఇండియా ఉత్పత్తిగా మెషిన్‌ గన్స్‌ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్‌ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు.

DRDO: కాళ్లకల్‌లో అధునాతన మెషిన్‌ గన్స్‌ తయారీ

  • డీఆర్డీఏ సహకారంతో ‘లోకేశ్‌’ పరిశ్రమలో ఉత్పత్తి

  • 550 గన్స్‌ ఆర్మీ అధికారులకు అందజేత

మనోహరాబాద్‌, సెప్టెంబరు 30: డీఆర్డీఏ సహకారంతో ఆధునిక పరిజ్ఞానంతో మేడిన్‌ ఇండియా ఉత్పత్తిగా మెషిన్‌ గన్స్‌ను తయారు చేసి ఆర్మీకి అందిస్తున్నామని లోకేశ్‌ మిషనరీ పరిశ్రమ ప్రతినిధి లోకేశ్వరరావు తెలిపారు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌ గ్రామ శివారులోని టీజీఐసీసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన లోకేశ్‌ మిషనరీ పరిశ్రమలో ఉత్పత్తి అయిన 550 మెషిన్‌ గన్స్‌ను సోమవారం ఆర్మీ అధికారులకు అందజేశారు.


ఆయుధ పూజ అనంతరం వాహనాన్ని ఆర్మీ ప్రతినిధుల సమక్షంలో పరిశ్రమ ఎండీ శ్రీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్మీ, బీఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ తదితర సిబ్బంది కోసం ఆర్డర్‌పై గన్స్‌ తయారు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ ధపా 550 రూపొందించామని పేర్కొన్నారు. మేజర్‌ జనరల్‌ రాకేశ్‌ మనోచా ఆధ్వర్యంలో వాటిని అందజేసినట్లు తెలిపారు. అంతకుముందు పరిశ్రమలో మెషిన్‌ గన్స్‌ను ప్రదర్శించారు. ఎండీ శ్రీకృష్ణ వాటి పనితీరును ఆర్మీ ప్రతినిధులకు వివరించారు.

Updated Date - Oct 01 , 2024 | 04:33 AM