Madhu Yaskhi Goud: మోదీ పాలనలో రాష్ట్రాలకు తీరని అన్యాయం
ABN , Publish Date - Mar 29 , 2024 | 10:26 PM
కేంద్రంలో మోదీ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో పలు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ (Madhu Yaskhi Goud) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. మధు యాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో (Congress) కీలక విషయాలపై చర్చించారు.
హైదరాబాద్: కేంద్రంలో మోదీ 10 ఏళ్ల దుర్మార్గ పాలనలో పలు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ (Madhu Yaskhi Goud) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. మధు యాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో (Congress) కీలక విషయాలపై చర్చించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.
Komatireddy Venkatareddy: త్వరలో సినిమా థియేటర్లపై రైడ్స్.. కోమటిరెడ్డి సంచలనం
ఈ సందర్భంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. ప్రచార కమిటీ సభ్యుల కృషితో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ నియోజక వర్గాలల్లో, అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం చేయాలని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలన, వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సానుకూలంగా ఉన్నారని.. వారికి మన కార్యక్రమాలను విపులంగా వివరించాలని మధు యాష్కీగౌడ్ అన్నారు.
BJP-BRS: బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్ స్ట్రాంగ్ కామెంట్స్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి