Share News

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:54 AM

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది.

Mahbubnagar MLC Result: మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వశం

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో (Mahbubnagar MLC By Election Result) బీఆర్ఎస్ (BRS) విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎం.నవీన్ రెడ్డి (Naveen Reddy) గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్ నవీన్ రెడ్డికి763 ఓట్లు, మన్నే జీవన్ రెడ్డి కి 652 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ సీటును బీఆర్ఎస్ గెలుపొందింది. కాగా మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.


కాంగ్రెస్ తరపున మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్‌ కుమార్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌ ప్రధాన అభ్యర్థులుగా పోటీ పడ్డారు. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 28న ఈ ఉప ఎన్నిక జరగగా ఏప్రిల్ 2న ఫలితం వెలువడాల్సి ఉంది. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయడంతో నేడు (ఆదివారం) కౌంటింగ్‌ను నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో కూటమి గెలుస్తుందంటూ జోరుగా పందేలు!

మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. 24గంటలు దుకాణాలు బంద్‌

For more Telangana News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 11:03 AM