TG News: చెంగిచెర్లలో గిరిజన మహిళపై దాడి హేయమైన చర్య
ABN , Publish Date - Mar 28 , 2024 | 10:43 PM
చెంగిచెర్లలో గిరిజన మహిళపై ఓ వర్గం దాడి చేయడం హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు.
నిర్మల్: చెంగిచెర్లలో గిరిజన మహిళపై ఓ వర్గం దాడి చేయడం హేయమైన చర్య అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Maheshwar Reddy) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఇతర నేతలపై కేసులు పెట్టడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అక్కడకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. త్వరలోనే బీజేపీ శాసనసభాపక్షం తరపున బాధితులను పరామర్శిస్తామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని హెచ్చరించారు.
ఆ భూములను పేదలకు పంచిపెడతా..
నిర్మల్‌లో కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, పేదలకు పంచిపెడతామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ కాపాడుతోందని అన్నారు. సోఫీనగర్‌లో ప్రభుత్వ భూమిలో డీమార్ట్ నిర్మించినా అధికారులు ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాక్షాత్తు రెవెన్యూశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి