TG Politics: అందుకే డీకే శివకుమార్‌ను కలిశా.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Mar 14 , 2024 | 05:45 PM
బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)ని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరో బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిశారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని స్పష్టం చేశారు.
హైదరాబాద్: బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Sivakumar)ని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మరో బీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిశారు. అయితే వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎవ్వరు ఎంపీగా పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసి రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని స్పష్టం చేశారు. బెంగుళూరులో ఓ యూనివర్సిటీ అమ్ముతానని అంటే వెళ్లానని అన్నారు. యూనివర్సిటీ పనుల కోసం డీకే శివకుమార్‌ను కలిశానని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అసత్య ప్రచారాలు నమ్మెద్దని మల్లారెడ్డి అన్నారు.
ప్రియాంక గాంధీతో మల్లారెడ్డి భేటీ కానున్నారా..?
కాగా.. మల్లారెడ్డి ఈ ప్రచారాన్ని కొట్టివేసినప్పటికీ.. ఆయన తన ఆస్తులను కాపాడుకోవటానికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కాంగ్రెస్ కేంద్ర అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్లాన్‌లో భాగంగానే డీకే శివకుమార్‌తో మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలయిన తర్వాత గులాబీ నేతలు వరుసగా కాంగ్రెస్, బీజేపీలోకి జంప్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి