Share News

Bandi Sanjay: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాయి: బండి సంజయ్

ABN , Publish Date - Jun 30 , 2024 | 05:19 PM

కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు(Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.

Bandi Sanjay: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశాయి: బండి సంజయ్

సిద్దిపేట: కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ పాఠశాలలు, శిశు మందిరాలను ఛిన్నాభిన్నం చేశాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు. సంస్కృతీ, సంప్రదాయాలకు శిశుమందిర్ పాఠశాలలు (Shishumandir Schools) నిలయాలని కేంద్ర మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ (Husnabad) సరస్వతీ శిశుమందిర్ పాఠశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు.


భవిష్యత్ తరాలకు మంచి మార్గంలో బోధన అందించేందుకు ఈ పాఠశాలలు ఎంతో దోహదపడతాయని సంజయ్ చెప్పారు. శిశుమందిర్ విద్యార్థిగా క్రమశిక్షణతో న్యాయం, ధర్మం కోసం పోరాడితే గత ప్రభుత్వాలు తనపై 109కేసులు పెట్టాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ "ఈ భూమి బిడ్డలం.. హిందూవులం అందరం.. బ్రతుకు బంగారు లోకం" అనే పాట పాడి విద్యార్థులను అలరించారు.

Updated Date - Jun 30 , 2024 | 05:49 PM