Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..
ABN , Publish Date - Jun 16 , 2024 | 02:39 PM
MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..
MLA Raja Singh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో తాను అక్కడికి వెళ్తానని రాజాసింగ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ముంబైలో ఉన్న ఆయన ఇవాళ హైదరాబాద్‌కు వచ్చారు. రాజాసింగ్ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పోలీసులు.. ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.
ఐజీ రంగనాథ్ పర్యటన..
మెదక్ పట్టణంలో మల్టీజోన్ ఐజీ రంగనాథ్ పర్యటించారు. ఘర్షణల నేపథ్యంలో మెదక్ పట్టణం, మండలం వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. శనివారం సాయంత్రం మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలకు కారణమైన ఇరు వర్గాల్లో 45 మందిని గుర్తించామని ఐజీ తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఐజీ రంగనాథ్ హెచ్చరించారు. పశువులు తరలిస్తున్నట్లు ఏమైనా సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు.
జంతువధ విషయంలో ఘర్షణ..
మెదక్ జిల్లా కేంద్రంలో జంతువధకు సంబంధించిన రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదం కాస్తా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసి.. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నేతలు మెదక్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.