Share News

Telangana: ఆ రెండు పార్టీలు తెలంగాణను మోసం చేశాయి: హరీష్ రావు

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:21 PM

కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిపంచారు. ఆదివారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ. 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు.

Telangana: ఆ రెండు పార్టీలు తెలంగాణను మోసం చేశాయి: హరీష్ రావు
MLA Harish Rao

సిద్దిపేట, ఆగష్టు 11: కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపిపంచారు. ఆదివారం నాడు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 229 మందికి రూ. 56 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను దారుణంగా మోసం చేశాయని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8 ఎంపీ సీట్లను ఇస్తే తెలంగాణను మోసం చేశాయన్నారు.


తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే.. ఆ పార్టీ మాత్రం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీకి ఆంధ్రా తీపి అయ్యింది.. తెలంగాణ చేదు అయ్యిందా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మహిళకు ఇస్తానన్న రూ. 2,500 ముచ్చట లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు బెల్టు షాపులను బంద్ చేస్తామని చెప్పిందని.. ఇప్పుడు మాత్రం గల్లీ గల్లీకో బెల్ట్ షాప్ పెట్టిస్తోందని దుయ్యబట్టారు.


మద్యం విషయంలో తమ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏం చేస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. మద్యంపై గత ఏడాది కంటే రూ. 7,300 కోట్లు ఎందుకు బడ్జెట్‌ పెంచారని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఇస్తానన్న ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయ్? అని ప్రశ్నించారు. కాళేశ్వరంపైనా అబద్ధాలే ప్రచారం చేశారని కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కూలిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేశారన్నారు. మరి కాళేశ్వరం కూలిపోతే రంగనాయక సాగర్‌లోకి నీళ్లు ఎలా వచ్చాయని హరీష్ రావు ప్రశ్నించారు.

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 11 , 2024 | 08:21 PM