Share News

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , Publish Date - Oct 19 , 2024 | 11:03 AM

ట్రెయినింగ్‌ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు.

MP Etala: ఎంపీ ఈటల రాజేందర్‌ సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

- ట్రెయినింగ్‌ సెంటర్ల పేరుతో ఉగ్రవాదులకు శిక్షణ

- రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోంది

హైదరాబాద్: ట్రెయినింగ్‌ సెంటర్ల పేరుతో ఉన్మాదులకు శిక్షణ ఇస్తుంటే రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తున్నదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Malkajigiri MP Etala Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌(Secunderabad)లోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఎంపీ ఈటల సందర్శించారు. ఆలయంలో చండీహోమం నిర్వహించగా అమ్మవారికి సాక సమర్పించాలని పురోహితులు సూచించడడంతో మహిళలతో కలిసి ఎంపీ ఈటల అమ్మవారికి సాక సమర్పించారు. అనంతరం 31వ బస్టాప్‌ సమీపంలో ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి సాక సమర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే ఉన్మాదులదాడిలో ఎంతో మంది ప్రాణాలు కొల్పోయారని, ఇప్పటి వరకు ఆరు ఆలయాలపై దాడులు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గచ్చిబౌలి డిపోలో 69 విద్యుత్‌ బస్సులు..


ఆలయంలో దాడి చేసిన నిందితుడు ఆస్పత్రిలో బెడ్‌ మీద దర్జాగా పడుకుని ఈ పని అల్లా చేయించాడని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేంద్రం రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం జరిగే సికింద్రాబాద్‌ బంద్‌కు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. అమ్మవారి విగ్రహం ధ్వంసం అనంతరం రెండెంచల భద్రతలో పోలీసులు కొంతమేర శుక్రవారం ఆంక్షలు సడలించారు. ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు చూసిన తరువాత ఆలయంలోకి అనుమతించారు.


..................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

Hyderabad: సహ భాగస్వామికి తెలియకుండా ఫ్లాట్స్‌ విక్రయం..

- బాధితుడు అడిగితే బెదిరింపులు

- ఘటన ఆలస్యంగా వెలుగులోకి

హైదరాబాద్: యజమానికి తెలియకుండా భవనం విక్రయించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులపై పోలీసు లకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మల్కాజిగిరి ఉప్పర్‌గూడ(Malkajigiri Upperguda)కు చెందిన దండు లచ్చిరాజు మియాపూర్‌ మాతృశ్రీగర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 44/1లో ప్లాట్‌ నంబర్‌ 90లోని 389 చదరపు అడుగుల గజాల స్థలాన్ని 1980లో కొనుగోలు చేశాడు. ఇతని ప్లాట్‌ పక్కన గల 89వ నంబర్‌ ప్లాట్‌ జె. ప్రభావతిది. ఇద్దరూ కలిసి రెండు ప్లాట్లలో భవనం నిర్మించాలని నిర్ణ యించారు. బహుళ అంతస్థుల భవనం నిర్మిం చేందుకు 2015లో జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకొని జేవీఆర్‌ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.


కొంతకాలానికి భవన నిర్మాణం పూర్తయింది. ప్రభావతి.. లచ్చిరాజుకు తెలియ కుండా కొన్ని ఫ్లాట్‌లను పాస్మో హాస్పిటాలిటీకి 2017లో రిజిస్ర్టేషన్‌ చేయించారని లచ్చిరాజు పేర్కొన్నాడు. తన అనుమతి లేకుండా ఫిడ్జి హాస్టళ్లకు అద్దెకు ఇచ్చారన్నారు. వారిని అడిగితే బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై 2019, 2020, 2021లో పలుమార్లు మియాపూర్‌(Miyapur) పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించు కోలేదని దండు లచ్చిరాజు వాపోయాడు. లచ్చిరాజు బంధువు చిట్టిబాబు జీపీఏ చేసుకున్నారు. దీంతో చిట్టిబాబుపై ఈ నెల 5వ తేదీన పోలీ సులకు ఫిర్యాదు చేశాడు.


భవనాన్ని ఆక్రమించిన పాస్మో హాస్పిటాలిటీ సర్వీస్‌ భాగస్వాములు బోయినపల్లి వెంకటేశ్వరరావు, తన్నీరు గౌతమ్‌, వెంకటేశ్వరరావు, గారపాటి నాగరవి, గోని రాజ్‌కుమార్‌, జంపన్న ప్రభావతి, ఫిడ్జి లిమిటెడ్‌ బ్రాంచ్‌ నిర్వాహకులు, టి.పద్మజారావుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు లచ్చిరాజు పేర్కొన్నాడు.


ఇదికూడా చదవండి: Cyberabad police: ఆర్‌జే శేఖర్‌ బాషా అరెస్టు..

ఇదికూడా చదవండి: High Court: ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితుడు రాధాకిషన్‌రావు

ఇదికూడా చదవండి: Bhupalpally: సింగరేణి ఓసీపీలతో దినదిన గండం!

ఇదికూడా చదవండి: Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 19 , 2024 | 11:03 AM