MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..
ABN , Publish Date - Dec 28 , 2024 | 09:45 AM
దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు.
- ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: దేశంలో వ్యవసాయం, దుస్తులు ఆఖరికి ఇల్లు కావాలన్నా.. జీవించడానికి కావాల్సిన ప్రతి ప్రధాన పని విశ్వకర్మలతోనే ముడిపడి ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. అఖిలభారత విశ్వకర్మ మహాసభను అధ్యక్షుడు కౌలె జగన్నాథం అధ్యక్షతన కొత్తపేట బాబుజగ్జీవన్‌రామ్ భవన్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఈటల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: భార్యకు ఫోన్ చేసి బలవన్మరణం..
ఆ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారిలే ఇందుకు నిదర్శనమన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి గుజరాత్ రాష్ట్రంలో అత్యంత సన్నిహితంగా ఉన్న వర్గాలు విశ్వకర్మలేనన్నారు. విశ్వకర్మల ఆర్థికాభివృద్ధి కోసం ప్రధాని మోదీ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
రాష్ట్రంలో 25లక్షల జనాభ కలిగి ఉన్న విశ్వకర్మలు కులవృత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే కులవృత్తులకు తోడ్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారని ఆశపడ్డారని తొమ్మిదేళ్ల కాలంలో పాలకులు విశ్వకర్మల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. జగన్నాథం మాట్లాడుతూ విశ్వకర్మ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని కోరారు.
55 సంవత్సరాలు నిండిన వృత్తి కళాకారులకు రూ.5వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. రాజకీయంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నారు. బ్యాంకు గ్యారెంటీ లేకుండా రూ.25లక్షల వరకు వ్యక్తిగత రుణం ఇప్పించాలని కోరారు. రాష్ట్ర రాజధానిలో కేటాయించిన 5ఎకరాల స్థలంలో రూ. 200కోట్లతో అన్ని వసతులతో విశ్వకర్మ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జ యంతి సందర్భంగా ప్రతిభకనబర్చిన విశ్వకర్మ చేతి వృత్తిదారులకు గౌరవ పురస్కారాలు ఇవ్వాలన్నారు.
ఈసందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, కార్పొరేటర్లు రాధాధీరజ్‌రెడ్డి, పవన్‌కుమార్, విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షుడు చెడ్డిలాల్‌శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలే్‌షకుమార్, ప్రధాన కార్యదర్శి దినేష్ బాయ్‌శర్మ, ఉపాధ్యక్షుడు ఎంఎం శర్మ, నాయకులు మనోరంజన్, రాజశేఖర్, కృష్ణగంజ్, సూర్యనారాయణ, గులాబ్‌శర్మ, చెన్నయ్యచారి, లింగాచారి, మురళీధర్‌చారి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News