Share News

Sunkishala incident: సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం..

ABN , Publish Date - Aug 13 , 2024 | 05:00 PM

ఆగస్టు 2న సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. అయితే తాజాగా ఘటన జరిగిన సుంకిశాల ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి సహా స్థానిక బీజేపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Sunkishala incident: సుంకిశాలను సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేల బృందం..

నల్గొండ: ఆగస్టు 2న సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. అయితే తాజాగా ఘటన జరిగిన సుంకిశాల ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఎ.వి.ఎన్. రెడ్డి సహా స్థానిక బీజేపీ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.


సుంకిశాల ఘటన రాష్ట్ర ప్రజలందర్నీ విస్తుపోయేలా చేసిందని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆగస్టు 2న ప్రమాదం జరిగితే సోషల్ మీడియాలో వచ్చే వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందో చెప్పాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోందా? అంటూ ప్రశ్నించారు. మెుదట రూ.1,500 కోట్ల అంచనా అంటూ ఇప్పుడు రూ.2,215కోట్లకు ఎందుకు పెంచారో చెప్పాలంటూ మహేశ్వర్ రెడ్డి వరస ప్రశ్నలు సంధించారు. ప్రాజెక్టు పూర్తికాక ముందే టన్నెల్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్టర్ టన్నెల్ ఓపెన్ చేశారని అధికారులు చెప్తున్నారు. దీనిపై విచారణ చేశారా? ఘటనపై త్రిమెన్ కమిటీ వేశారు కదా మరి ఇంకా నివేదిక అందలేదా? అంటూ ప్రశ్నించారు. పంప్ హౌస్‌లో నాసిరకం పనులు చేశారని, మేఘా కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.


సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్ తప్పు స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. మేఘా కృష్ణారెడ్డి లైసెన్స్ రద్దు చేయాలని, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది అతి చిన్న ప్రమాదం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. రూ.2వేల కోట్ల ప్రజా ధనం చిన్న విషయమా అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు. ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందో చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత గాని ప్రభుత్వం బయటపెట్టలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని అధికారులు చెప్తున్నారని, కానీ ఆ అంశంలో తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. దీనిపై ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని హరీశ్ డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మేఘా సంస్థపై అనేక ఆరోపణలు చేశారని, మరిప్పుడు వారికెలా పనులు కట్టబెట్టారని ఎమ్మెల్యే హరీశ్ ప్రశ్నించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..

Updated Date - Aug 13 , 2024 | 05:04 PM