Minister Komati Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా.. కమీషన్లపైనే దృష్టి పెట్టింది
ABN , Publish Date - Jan 27 , 2024 | 10:30 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా కమీషన్లపైనే దృష్టిపెట్టిందని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటుకు శనివారం నాడు శంకుస్థాపన చేశారు.
నల్గొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా కమీషన్లపైనే దృష్టిపెట్టిందని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటుకు శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఒకేరోజు రూ. 134.5 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ తన కలల ప్రాజెక్టు అని తెలిపారు.
తనను గుండెల్లో పెట్టుకున్న నల్గొండ యువత రుణం తీర్చుకోవడానికి ఈ అవకాశం దొరికిందని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు కట్టడం పూర్తికాకముందే కూలిపోతున్నాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని వృథా చేసిన ఆ పార్టీ నాయకులు తమకు నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.