Share News

Nalgonda: డిండి గురుకులంలో 16 మంది విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:21 AM

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Nalgonda: డిండి గురుకులంలో 16 మంది విద్యార్థినులను కొరికిన ఎలుకలు..

  • ఆసత్రిలో చికిత్స.. విద్యార్థి సంఘాల ఆందోళన

డిండి, జూలై 6: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 16 మంది విద్యార్థినులను ఎలుకలు గాయపర్చాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయాలైన విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పాఠశాల ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్‌.. ఎలుకలు తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నెల 2న ఆరుగురు, 3న ఆరుగురు, 5న నలుగురిని ఎలుకలు గాయపరచగా, వైద్యం అందించినట్లు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం రికార్డుల్లో నమో దు చేశారు. ఈ విషయమై ప్రిన్సిపాల్‌ పద్మను వివరణ కోరగా నలుగురిని మాత్రమే ఎలుకలు గాయపర్చినట్లు తెలిపారు.


విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఎన్‌ఎ్‌సయూఐ, ఏఐఎ్‌సఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో గురుకులం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా, పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు 640 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల చుట్టూ పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాములు తిరుగుతున్నాయని విద్యార్థినులు తెలిపారు. పరిసరాల్లో మురుగునీరు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోందని, ఈగలు, దోమలు వ్యాపించి బాలికలు అనారోగ్యం పాలవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

Updated Date - Jul 07 , 2024 | 05:21 AM