Share News

Land Laws: ఆర్వోఆర్‌ ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతాం

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:32 AM

ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్‌-2024 ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతామని లైసెన్స్డ్‌ సర్వేయర్లు వెల్లడించారు.

Land Laws: ఆర్వోఆర్‌ ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతాం

  • ప్రకటించిన లైసెన్స్డ్‌ సర్వేయర్లు

  • భూ యజమానుల హక్కులు కాపాడాలంటే సమగ్ర చట్టం తేవాలి

  • తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

హైదరాబాద్‌, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్‌-2024 ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతామని లైసెన్స్డ్‌ సర్వేయర్లు వెల్లడించారు. హైదరాబాద్‌ లక్డీకపూల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆర్వోఆర్‌-2024 ముసాయిదాపై చర్చించారు. సమావేశానికి డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, భూ చట్టాల నిపుణుడు సునీల్‌ హాజరయ్యారు. లచ్చిరెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఆర్వోఆర్‌ ద్వారా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వివరించారు.


సునీల్‌ మాట్లాడుతూ ప్రతి లైసెన్స్డ్‌ సర్వేయర్‌ గ్రామీణ ప్రజలకు ఆర్వోఆర్‌ చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సర్వేయర్లు మాట్లాడుతూ ముసాయిదా చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. భూ యజమానుల హక్కులను పూర్తిస్థాయిలో కాపాడాలంటే ప్రభుత్వం ఆర్వోఆర్‌-2024చట్టాన్ని సమగ్రంగా తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అభిప్రాయపడింది. ఆర్వోఆర్‌-2024 ముసాయిదాపై హైదరాబాద్‌లో శనివారం రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు.

Updated Date - Aug 18 , 2024 | 04:32 AM