Pocharam: రుణాలు మాఫీ చేయడం అభినందనీయం
ABN , Publish Date - Jul 18 , 2024 | 03:56 PM
Telangana: ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ఈరోజు సాయంత్రానికి ప్రారంభంకానుంది. దాదాపు లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలు మాఫీ చేయడంఅభినందనీయమన్నారు.
నిజామాబాద్, జూలై 18: ఎంతో కాలంగా రైతులు ఎదురు చూస్తున్న రుణమాఫీ ఈరోజు సాయంత్రానికి ప్రారంభంకానుంది. దాదాపు లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణాలు మాఫీ చేయడం అభినందనీయమన్నారు.
Nara Lokesh: జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్..
ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ దేశంలో తెలంగాణ మినహా మరే రాష్టంలోనూ లేదని తెలిపారు. మొదటి విడతగా లక్ష లోపు రుణాలు ఈరోజు మాఫీ అవుతున్నాయన్నారు. ఈ డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసి, వారిని రుణ విముక్తులు చేస్తున్నారన్నారు. ఒక రైతుగా సీఎంకు, మంత్రి వర్గానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
Mahasena Rajesh: ఆ సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు
కాగా.. ఈరోజు సాయంత్రానికి లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్నటి పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం ఈమేరకు ప్రకటన చేశారు. సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు ఉన్న రైతురుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. రూ.7వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళతాయన్నారు. నెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆగస్టులో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేసి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ రైతును రుణ విముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడంలేదన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని స్పష్టం చేశారు. అందుకే ఏకమొత్తంలో రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ అని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి...
AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ
T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ
Read Latest AP News And Telugu News