Share News

MP Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేయొద్దు

ABN , Publish Date - Jan 20 , 2024 | 04:30 PM

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind ) హెచ్చరించారు. బోధన్ మండలం అమ్దాపుర్ గ్రామంలో శనివారం నాడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు.

MP Arvind: వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేయొద్దు

నిజామాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ( MP Arvind ) హెచ్చరించారు. బోధన్ మండలం అమ్దాపుర్ గ్రామంలో శనివారం నాడు వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ అయుష్మన్ భారత్ కార్డుపై రాజీవ్ గాంధీ ఫొటో పెట్టేందుకు కుట్ర పన్నిందని... ఈ వ్యవహారంతో కార్డులు అందడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం తప్పని సరిగా ఉండాలని ఎంపీ అరవింద్ కోరారు.

షకీల్ తన తీరు మార్చుకోవాలి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని చెప్పారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కోరిక మేరకు ఎడపల్లి గురుకుల పాఠశాలకు ఎంపీ కోట నుంచి నిధులను విడుదల చేశానని తెలిపారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన తీరు మార్చుకోవాలన్నారు. హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలకు కారకుడైన షకీల్ తన కుమారుడిని జైలుకు పంపి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తన కొడుకు ఆ ప్రమాదానికి కారకుడైతే వెంటనే జైలుకు పంపుతానని.. తాను వెనకేసుకు రానని ఎంపీ అరవింద్ తెలిపారు.

Updated Date - Jan 20 , 2024 | 04:35 PM