TG Politics: సన్నబియ్యం టెండర్లలో రూ.1000 కోట్ల భారీ కుంభకోణం: పెద్ది సుదర్శన్ రెడ్డి
ABN , Publish Date - May 18 , 2024 | 08:00 PM
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ టెండర్లలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.అధికార కాంగ్రెస్ నేతలు చేతి వాటంతో టెండర్లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వాటా పేరుతో మిల్లర్లను దోపిడీ చేస్తున్నారని.. ఇందులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లకు సన్న బియ్యం టెండర్లలో కుంభకోణం జరిగిందని చెప్పారు. ఈ ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తోందని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి, ముఖ్యమంత్రి పేషీకి మూటలు పంపించేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో ధర 42రూపాయలు ఉందని.. కానీ 57రూపాయలు టెండర్ కోట్ చేయడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. పది పైసల తేడాతో నాలుగు ప్రైవేట్ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయని ఆరోపణలు చేశారు. ఇందులో వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందని.. ఈ విషయంపై అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
Lok Sabha Election 2024: తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా మీనామేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. రేవంత్ ప్రభుత్వం సంరక్షణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Malla Reddy: మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్.. తీవ్ర ఉద్రిక్తత
Jeevan Reddy: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారనడం దారుణం
Read more Telagana News and Telugu News