Share News

Warangal: ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:18 AM

నిందితులను కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకుంటూ వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్‌ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం చిక్కాడు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం గత నెల 27న బెల్లం లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని అన్నారంషరీఫ్‌ వద్ద పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Warangal: ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

  • కేసు నుంచి తప్పించేందుకు రూ.70 వేలు డిమాండ్‌

పర్వతగిరి, ఆగస్టు 2: నిందితులను కేసు నుంచి తప్పించడానికి లంచం తీసుకుంటూ వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోత్‌ వెంకన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు శుక్రవారం చిక్కాడు. వరంగల్‌ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం గత నెల 27న బెల్లం లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని అన్నారంషరీఫ్‌ వద్ద పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అయితే పట్టుబడిన ముగ్గురు నిందితులను తప్పించేందుకు ఎస్సై వెంకన్న రూ.70వేలు డిమాండ్‌ చేశారు. అదే రోజు రూ.20వేలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయడంతో వారిని వదిలేశాడు.


స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు మరో రూ.50వేలు ఇవ్వాలని, లేకపోతే జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిస్తానంటూ ఒత్తిడి చేయడంతో నిందితుడు బెల్లం వ్యాపారి బాదావత్‌ భాస్కర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పథకం ప్రకారం రూ.40వేలు ఇస్తామని శుక్రవారం భాస్కర్‌ ఎస్సైకి ఫోన్‌ చేయగా ఆయన తన డ్రైవర్‌ సదానందంకు ఇవ్వాలన్నాడు. ఆమేరకు డ్రైవర్‌కు డబ్బులివ్వడంతో అతను ఆ మొత్తం తీసుకుని ఎస్సై ఆఫీసుకు వెళ్లగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఎస్సై, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Aug 03 , 2024 | 05:18 AM