Rammohan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం మోదీ తరం కాదు
ABN , Publish Date - Mar 18 , 2024 | 04:10 PM
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (Rammohan Reddy) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Modi) జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) కూలగొట్టడం ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరం కాదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి (Rammohan Reddy) అన్నారు. సోమవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని మోదీ (PM Modi) జగిత్యాల సభలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడమే లక్షంగా బీజేపీ పనిగట్టుకుందని మండిపడ్డారు. పార్టీలో చేరడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ముందుకు వచ్చినా పార్టీలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరితే గులాబీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
దయ్యాలు వేదాలు వల్లించినట్లు గులాబీ పార్టీ నేతల తీరు ఉందన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ పార్టీదని చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఐదేళ్లు ఎలా కొనసాగించాలో తమకు తెలుసునని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తారని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి
PM Modi: కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన మోదీ.. ఆ ఇద్దరికీ వార్నింగ్..!
Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?
Jeevan Reddy: ‘మీరే మూసి మీరే తెరుస్తా అంటారా’.. ప్రధాని మోదీపై జీవన్‌రెడ్డి ఫైర్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి