Share News

CBN: రామోజీరావు ఒక వ్యవస్థ ..

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:17 AM

చాలా బాధాకరం. యుగపురుషుడు... ఒక పర్పస్‌ కోసం పుట్టిన వ్యక్తి. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రామోజీరావు చివరి శ్వాస వరకూ సమాజహితం కోసం పని చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేశారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు.

CBN: రామోజీరావు ఒక వ్యవస్థ ..

చాలా బాధాకరం. యుగపురుషుడు... ఒక పర్పస్‌ కోసం పుట్టిన వ్యక్తి. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రామోజీరావు చివరి శ్వాస వరకూ సమాజహితం కోసం పని చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేశారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు. ఆయన ఓ వ్యక్తి కాదు ఒక వ్యవస్థ. 40 ఏళ్లగా ఆయనతో నాకు పరిచయం ఉంది. నాకు ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మీరు ఏం చెప్పినా ‘ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను’ అని, ఎప్పుడు ప్రజాపక్షానే ఉంటానని స్పష్టంగా చెప్పేవారు. పత్రికా రంగంతోపాటు చిత్ర పరిశ్రమకూ ఎనలేని సేవలు చేశారు. రామోజీరావు స్ఫూర్తితో తెలుగు జాతిని ముందుకు తీసుకువెళ్తా.

- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Updated Date - Jun 09 , 2024 | 05:17 AM