RBI : రూ.3000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం
ABN , Publish Date - Aug 14 , 2024 | 04:58 AM
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది.
ఆర్బీఐ ఈ వేలం ద్వారా సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రూ.3000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ-వేలం ద్వారా దీన్ని సేకరించింది. 11 ఏళ్ల కాల పరిమితి, 7.26 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.1000 కోట్లు, 14 ఏళ్ల కాల పరిమితి, 7.28 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితి, 7.28 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.1000 కోట్ల చొప్పున ఈ రుణాన్ని తీసుకుంది. రాష్ట్రంతో కలిపి దేశంలోని ఏడు రాష్ట్రాలు మొత్తం రూ.15,950 కోట్ల అప్పులు తీసుకున్నాయి.