Share News

Hyderabad: ఉగ్రవాదులకు మీ ఖాతాలోంచి డబ్బులు వెళ్లాయి..

ABN , Publish Date - May 28 , 2024 | 06:17 AM

క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు.. మీ ఖాతా నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్లాయని భయపెట్టి ఓ వృద్ధుడి నంచి రూ.2లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆ సైబర్‌ కేటుగాళ్లు, రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేశారు. ఆయన లిఫ్ట్‌ చేయగానే ఆవలివైపు పోలీసు యూనిఫామ్‌లో ఓ దుండగుడు కనిపించాడు.

Hyderabad: ఉగ్రవాదులకు మీ ఖాతాలోంచి డబ్బులు వెళ్లాయి..

  • రిటైర్డ్‌ ఉద్యోగికి సైబర్‌ కేటుగాడి బెదిరింపులు

  • భయపడిపోయి రూ.2లక్షలు ఇచ్చుకున్న పెద్దాయన

హైదరాబాద్‌ సిటీ, మే 27(ఆంధ్రజ్యోతి): క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ అర్ధరాత్రి వాట్సాప్‌ కాల్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు.. మీ ఖాతా నుంచి ఉగ్రవాదులకు డబ్బులు వెళ్లాయని భయపెట్టి ఓ వృద్ధుడి నంచి రూ.2లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం... ఆ సైబర్‌ కేటుగాళ్లు, రిటైర్డ్‌ ఉద్యోగికి వాట్సాప్‌ వీడియో కాల్‌ చేశారు. ఆయన లిఫ్ట్‌ చేయగానే ఆవలివైపు పోలీసు యూనిఫామ్‌లో ఓ దుండగుడు కనిపించాడు. తనను తాను ముంబై తిలక్‌నగర్‌లోని క్రైమ్‌ బ్రాంచ్‌ ఎస్సైగా పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పబోయే విషయం దేశ అంతర్గత భద్రతకు సంబంధించిందని, భార్యతోనూ చెప్పొద్దంటూ హెచ్చరించాడు.


తర్వాత.. సంభాషణ కొనసాగిస్తూ బ్యాంకు ఖాతా నుంచి ఉగ్రవాదులకు లావాదేవీలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించి, క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఫలితంగా మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదైందని చెప్పాడు. ఖాతాలపై ఆర్బీఐ ప్రతినిధులు ఆడిట్‌ జరుపుతుందనీ.. బ్యాంకు ఖాతా స్తంభింపజేశారని, ఏ క్షణమైనా వచ్చి అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించాడు. ఇదంతా జరగకుండా, ఆర్‌బీఐ ఆడిట్‌ డిపార్టుమెంట్‌ను మేనేజ్‌ చేయొచ్చని, ఇందుకు రూ.2లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అప్పటికే అతడి ఉచ్చులో పడిపోయిన ఆ పెద్దాయన రూ.2 లక్షలను అతడు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. మరుసటి రోజు షాక్‌ నుంచి తేరుకొని.. తాను మోసపోయినట్లు గుర్తించి..సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - May 28 , 2024 | 06:17 AM