Share News

Seethakka: మహిళా పథకాలను ఎగతాళి చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పండి

ABN , Publish Date - Aug 15 , 2024 | 03:13 AM

మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు.

Seethakka: మహిళా పథకాలను ఎగతాళి చేస్తున్న వాళ్లకు బుద్ధి చెప్పండి

  • ఎన్‌కౌంటర్లతో సమాజంలో మార్పు రాదు

  • స్ర్తీనిధి సర్వసభ్య సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక భద్రతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్ర్తీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ 11వ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం మహిళల కోసం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటివి అమలు చేస్తోందని చెప్పారు.


కొందరు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వీడియోలు తీసి ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ప్రయాణ సమయంలో కుట్లు, అల్లికలు, ఎల్లిపాయ పొట్టుతీస్తే తప్పేంటని సీతక్క ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్లతో సమాజంలో మార్పురాదని.. వరంగల్‌, దిశ ఎన్‌కౌంటర్లతో సమాజం ఏం మారలేదని, మహిళలపై వేధింపులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. కాగా, ‘కాంగ్రెస్‌ అధికారం చేపట్టేనాటికి మిగులు బడ్జెట్‌ అంటూ.. అబద్ధాలు చెబుతున్నారు.. మేం వచ్చేసరికి అన్ని శాఖల్లో కలిపి రూ.72వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను వారసత్వంగా మోపారు.


ఇది వదిలేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశామంటూ అసత్య ఆరోపణలు చేయడం బీఆర్‌ఎస్‌ నేతలకు తగదు’ అని మంత్రి సీతక్క బుధవారం ఓ ప్రకటనలో పేర్కొ న్నారు. పంచాయతీలకు నిధుల్లేక పాలన పడకేసిందంటూ.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు.

Updated Date - Aug 15 , 2024 | 03:13 AM