Aviation fuel: విమాన ఇంధనంపై వ్యాట్ 5-10% పెంపు?
ABN , Publish Date - Jul 15 , 2024 | 04:52 AM
ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘విమానాల ఇంధనం (ఏటీఎ్‌ఫ)’పై పన్నును పెంచాలని యోచిస్తోంది. ఏటీఎ్‌ఫపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 5 నుంచి 10 శాతం వరకు పెంచాలని ఆలోచిస్తోంది.
ఆదాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ కసరత్తు
హైదరాబాద్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉన్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ‘విమానాల ఇంధనం (ఏటీఎ్‌ఫ)’పై పన్నును పెంచాలని యోచిస్తోంది. ఏటీఎ్‌ఫపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 5 నుంచి 10 శాతం వరకు పెంచాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటీఎ్‌ఫపై 1 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచితే ఏడాదికి రూ.300 కోట్ల ఆదాయం వస్తుంది. వాస్తవానికి విమానాల ఇంధనంపై దేశంలో తెలంగాణ ప్రభుత్వ మాత్రమే అతి తక్కువ వ్యాట్ వసూలు చేస్తోంది. రాష్ట్రంలో 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1 శాతానికి తగ్గించింది. 2017లో దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమల్లోకి వచ్చినప్పుడు.. పెట్రోలు, డీజిల్, ఏటీఎ్‌ఫపై విధిస్తున్న వ్యాట్‌ను కూడా జీఎస్టీలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం సూచించింది. కేంద్రం సూచనలతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమాన సర్వీసుల కనెక్టివిటీని పెంచుకోవాలంటే ఏటీఎ్‌ఫపై వ్యాట్‌ను తగ్గించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యోచించింది. ఏటీఎఫ్‌పై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను 1ు శాతానికి తగ్గిస్తూ 2018లో నిర్ణయం తీసుకుంది. కేంద్రం సూచన మేరకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ వంటి రాష్ట్రాలు 1 నుంచి 4 శాతం వరకు వ్యాట్‌ను తగ్గించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం 18 నుంచి 29 శాతం వరకు వసూలు చేస్తున్నాయి.
తమిళనాడు, బిహార్‌లో 29ు; రాజస్థాన్‌లో 26ు, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో 25 శాతం చొప్పున; అసోంలో 23.65ు, కర్ణాటకలో 18ు మేర వ్యాట్ వసూలు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒకసారి తగ్గించిన వ్యాట్‌ను మళ్లీ భారీగా పెంచితే.. కేంద్రానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చన్న సందేహం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకే ఇదివరకు అమలైన 16 శాతానికి కాకుండా.. కనీసం 10 శాతం వరకైనా పెంచాలన్న ఆలోచన చేస్తోం ది. వ్యాట్ పెంపును పరిశీలించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.