Share News

NEET: నీట్‌(యూజీ)-2024 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విజయపరంపర

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:05 AM

వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ)-2024 ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 720కి 720 మార్కులతో ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీల్లో 8 ఫస్ట్‌ ర్యాంకులు సాధించి నారాయణ విద్యాసంస్థలు తమ అధిపత్యాన్ని కొనసాగించాయి.

NEET: నీట్‌(యూజీ)-2024 ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విజయపరంపర

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌(యూజీ)-2024 ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీలో నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 720కి 720 మార్కులతో ఆల్‌ ఇండియా ఓపెన్‌ కేటగిరీల్లో 8 ఫస్ట్‌ ర్యాంకులు సాధించి నారాయణ విద్యాసంస్థలు తమ అధిపత్యాన్ని కొనసాగించాయి. ఓపెన్‌ కేటగిరీలో సామ్‌ శ్రేయాస్‌ జోసెఫ్‌ ఆల్‌ ఇండియా 1వ ర్యాంకుతో సంచలన విజయం నమోదు చేసుకున్నారు. కె. సందీప్‌ చౌదరి, షాహ్‌, పి. ఆదిత్య కుమార్‌, శశాంక్‌ శర్మ, ఈషా కొఠారి, ప్రాచిత, దర్శ్‌ పగ్‌దార్‌ మొత్తం 8 మంది తమ విద్యార్థులు ఫస్ట్‌ ర్యాంకులతో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డా. పి. సింధూర నారాయణ, పి. శరణినారాయణ తెలిపారు.


అలాగే 715 మార్కులు సాధించిన వారిలో 26 మంది నారాయణ విద్యార్థులు ఉడగా.. 710 ఆపైన మార్కులు సాధించిన వారిలో 45 మంది విద్యార్థులు ఉన్నారని వారు పేర్కొన్నారు. 700 ఆపైన మార్కులు సాధించిన వారు 105 మంది ఉన్నారన్నారు. నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన, రోజువారీ టెస్ట్‌లు నిర్వహించి ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నట్లు వారు తెలిపారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2024 | 03:05 AM