Supreme Court: కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంలో విచారణ..
ABN , Publish Date - Aug 19 , 2024 | 03:28 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆమెను ఈడీ, సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కవిత తిహాడ్ జైల్లో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిలు ఇచ్చేందుకు నిరాకరించింది.
దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. సీబీఐ, ఈడీ స్పందనలు తెలియజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20న చేపడతామని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తెలిపింది.