Share News

Osmania Hospital: గోషా మహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి?గోషా మహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి?

ABN , Publish Date - Aug 02 , 2024 | 03:22 AM

ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

Osmania Hospital: గోషా మహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి?గోషా మహల్‌లో ఉస్మానియా ఆస్పత్రి?

  • ఇప్పుడున్న చోటుకు 2-3 కిమీల దూరంలో..

  • 20-30 ఎకరాల్లో కొత్త భవనాల నిర్మాణం

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రిని అలానే వదిలేసి మరోచోట కొత్తగా ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.


ప్రస్తుత ఆస్పత్రి నుంచి 2-3 కిలోమీటర్లలోపు దూరంలో సుమారు 20-30 ఎకరాల్లో కొత్త భవనాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. ఈ స్థలంలో ఒక్కోటి 7-8 అంతస్తుల ఉండేలా బ్లాక్‌లు నిర్మించనున్నారు. ప్రస్తుత ఆస్పత్రికి సమీపంలో ఇంత స్థలం గోషామహల్‌ ప్రాంతంలోనే ఉందని ఉన్నతాఽధికారులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

Updated Date - Aug 02 , 2024 | 03:22 AM