Student Achievement: ఐరాస ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ గురుకుల విద్యార్థిని ఎంపిక
ABN , Publish Date - Aug 01 , 2024 | 04:32 AM
మలేషియాలో ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు తెలంగాణ గురుకుల విద్యార్థిని ఎంపికయింది.
మొయినాబాద్ రూరల్, జూలై 31: మలేషియాలో ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు తెలంగాణ గురుకుల విద్యార్థిని ఎంపికయింది. ఆ విద్యార్థినిని బుధవారం తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని స్థానిక మెథడిస్టు చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్న కృపవరం కూతురు కత్యపాక మెరల్ మేరబ్.
ఆమె ఇబ్రహీంపట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె పీజీ కోర్సులో చేరేందుకు సిద్ధమవుతోంది. అయితే మెరల్ మేరబ్ డిగ్రీ ఆఖరి ఏడాదిలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితి నిర్వహించిన రాత పరీక్ష, ఇంటర్వ్యూలో పాల్గొంది. దాంతో ఆమె ప్రపంచ యూత్ కాన్ఫరెన్స్‌కు ఎంపికయింది.