Share News

TGRTC: బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం..

ABN , Publish Date - Jul 07 , 2024 | 04:59 AM

ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు.

TGRTC: బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం..

  • చిన్నారికి లైఫ్‌ టైం ఉచిత బస్‌పాస్‌: సజ్జనార్‌

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్‌ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ.సజ్జనార్‌ ఘనంగా సన్మానించారు. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. శనివారం బస్‌ భవన్‌లో పురుడుపోసిన సిబ్బందిని ఆయన అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. సమయస్ఫూర్తితో స్పందించిన కండక్టర్‌ సరోజ, డ్రైవర్‌ ఎంఎం.


అలీ సేవలను ఈ సందర్భంగా సజ్జనార్‌ ప్రశంసించారు. ముషీరాబాద్‌ డిపోకు చెందిన 1 జెడ్‌ రూట్‌ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నంకు పురిటి నొప్పులు రావడంతో మహిళా ప్రయాణికుల సాయంతో కండెక్టర్‌ సరోజ సాధారణ ప్రసవం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం డ్రైవర్‌ అలీ తల్లీబిడ్డలను బస్సులో తీసుకెళ్లి గవర్నమెంటు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, శిశువుకు జనన ధ్రువీకరణ పత్రాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం అందజేశారు.

Updated Date - Jul 07 , 2024 | 04:59 AM