Fake Doctors: బస్తీల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు.. పోలీసుల కేసు నమోదు
ABN , Publish Date - May 17 , 2024 | 05:49 PM
ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉందంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్(hyderabad) బోరబండ(borabanda) పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల గుట్టును అధికారులు ఛేధించారు.
ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉందంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్(hyderabad) బోరబండ(borabanda) పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల గుట్టును అధికారులు ఛేధించారు. ఆ క్రమంలో వారి గురించి బొరబండ పోలీసులకు సమాచారం తెలుపగా, రంగంలోకి దిగిన పోలీసులు(police) వారిని అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.
అయితే ఎన్అర్అర్ పురం కాలనీలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారుల(Officers) దాడుల్లో భాగంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్ సర్టిఫికెట్ లేకుండానే రాజమౌళి, ఉదయ్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. అంతేకాదు వీరు ఏకంగా వేంకటేశ్వర క్లినిక్, ఏయూ హెల్త్ కేర్ పేరుతో క్లినిక్‌లను నిర్వహిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నారు.
తనిఖీల అనంతరం అధికారులు పలు రకాల మందులు, పరికరాలను స్వాధీనం చేసుకుని ఆ క్లినిక్‌లను సీజ్ చేశారు. నిందితులు కొన్ని నెలలుగా ఆ క్లినిక్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇలాంటి నకిలీ వైద్యుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. కొత్తగా ఎవరైనా క్లినిక్ ఏర్పాటు చేస్తే ఆయా డాక్టర్లకు ప్రభుత్వం నుంచి జారీ చేసిన సర్టిఫికెట్ ఉందో లేదో గమనించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
ఇవి కూడా చదవండి....
Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..
AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?
Read Latest Telangana News And Telugu News