Share News

Lok Sabha Election 2024: ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా: రఘునందన్ రావు

ABN , Publish Date - May 17 , 2024 | 05:41 PM

తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.

Lok Sabha Election 2024: ఆ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి.. లేకపోతే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తా:  రఘునందన్ రావు
Raghunandan Rao

హైదరాబాద్: తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.


Vijayashanti: కాంగ్రెస్‌లో ఉంటూనే బీఆర్‌ఎస్‌పై రాములమ్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్...

పోలింగ్ బూత్‌ల వారీగా లెక్కలు కట్టి ఎన్వలప్ కవర్‌లలో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారని చెప్పారు. 20కి పైగా కార్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారని.. అందులో డబ్బులు దొరికాయని అన్నారు. సీపీ సిద్దిపేట, ఎస్పీ మెదక్‌కు సరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో హరీష్ రావు, మరో ఆరుగురు ఎమ్మెల్యేలు డబ్బుల పంపిణీ చేశారని ఆరోపించారు.


BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..

రూ. 84లక్షలు 27 పోలింగ్ బూత్‌లకు పంపిణీ చేసే డబ్బులు ఒక్క కారులో దొరికాయని ఆరోపణలు చేశారు. రూ. 84లక్షల డబ్బులను BRS అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఖాతాలో వేసి డిస్‌క్వాలిఫై చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉందని పోలీసులు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఎఫ్‌ఐఆర్‌లో వెంకట్రామిరెడ్డిని A5గా చేర్చారని.. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ గుర్తించాలని రఘునందన్ రావు తెలిపారు.


ఇవి కూడా చదవండి....

Rakesh Reddy: బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను ప్రశ్నించే గొంతును..

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 05:49 PM