Share News

BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..

ABN , Publish Date - May 17 , 2024 | 04:16 PM

Telangana: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో..

BJP MLAs: వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలం..
BJP Leader Eleti Maheshwar reddy

హైదరాబాద్, మే 17: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (BJP Leader Eleti Maheshwar Reddy) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ (Revanth Government) బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్లు కొనుగోలులో సీఎం రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ విఫలమైందన్నారు. ఎప్పుడు పడిపోతుందో.. తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ నడుపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్‌తో కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే (Congress MLAs) బీజేపీతో (BJP) టచ్‌లో ఉన్నారన్నారు. సివిల్ సఫ్లై శాఖామంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttamkumar Reddy)విఫలమన్నారు.

IMD: ఇవాళ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక


ధాన్యాన్ని కొనుగోలు చేయించలేని ఉత్తమ్.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై అవగాహన లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వడ్లు కొనుగోలులో రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతులను బెదిరించటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు అయ్యాక.. సన్న బియ్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనటం‌ అన్యాయమని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి....

Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఒక్కరోజే రూ.14 లక్షల కోట్ల ఆదాయం!

Optical illusion: ఈ చిత్రంలో దాక్కుని ఉన్న పిల్లాడిని గుర్తిస్తే.. మీ చూపు తీక్షణంగా ఉన్నట్లే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 04:18 PM