Share News

Ponnam Prabhakar: మరో శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఏంటంటే..

ABN , Publish Date - Dec 23 , 2024 | 07:39 PM

నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు.

Ponnam Prabhakar: మరో శుభవార్త చెప్పిన తెలంగాణ  ప్రభుత్వం.. ఏంటంటే..

హనుమకొండ : నవోదయ విద్యాలయాన్ని వంగరలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. భీమదేవరపల్లి మండలం వంగరలో పీవీ నరసింహారావు 20వ వర్థంతి వేడుకలు ఇవాళ(సోమవారం) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... వారసత్వం లేకుండా నాటి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారతదేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చిన వ్యక్తి పీవీ అని చెప్పారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్లుగా.. ప్రధాని అయినా తన ఊరి గురించే ఎక్కువగా ఆలోచించిన వ్యక్తి పీవీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.


ప్రేమ ,ఆప్యాయతలతో ముందుకు పోవాలి...

సిద్దిపేట జిల్లా : మానవీయ విలువలతో అందరూ కలిసి మెలిసి ఉంటూ.. ఎలాంటి ఘర్షణలు లేకుండా అందరూ ప్రేమ, ఆప్యాయతలతో ముందుకు పోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ(సోమవారం) పర్యటించారు. హుస్నాబాద్‌లోని లక్ష్మి గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు -2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు , సింగిల్ విండో చైర్మన్ శివయ్య , నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి హాజరైన ఫాస్టర్లు , క్రిస్టియన్ ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... మీ అందరి ఆశీర్వాదంతో ప్రార్థనలతో తెలంగాణలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.


తమ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుందని అన్నారు. భవిష్యత్‌లో వచ్చే 4 సంవత్సరాలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. హుస్నాబాద్‌లో ఆర్డీవో స్థలాన్ని సేకరించి క్రిస్టియన్ల గౌరవాన్ని పెంచేలా.. వారికి భవన నిర్మాణ స్థలం అప్పగించాలని అన్నారు. మత విశ్వాసం ఏసుప్రభువు ఆలోచన విధానమని ప్రేమ, ఆప్యాయతలతో తమ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోయేలా ఆశీర్వదించాలని ఆ ప్రభువును వేడుకుంటున్నానని చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Pushpa 2: అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం పోలీసుల యాక్షన్ ప్లాన్ అదేనా..!

Hyderabad: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. కీలక మలుపు తిరిగిన కేసు..

Rachakonda CP: ఈ ఏడాది క్రైమ్ రేట్ ఎంతో చెప్పిన రాచకొండ సీపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 23 , 2024 | 07:48 PM