Share News

Health Risks: టూత్‌పేస్ట్‌తోనూ ప్రమాదమే..!

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:19 AM

మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. మనం ప్రతిరోజూ ఉదయం పళ్లు తోమడానికి ఉపయోగించే సాధారణ టూత్‌ పేస్ట్‌లూ, తలనొప్పికి, ఒళ్లు నొప్పులకు వాడే పెయిన్‌బామ్‌లు సైతం మనిషి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలుసా?

Health Risks: టూత్‌పేస్ట్‌తోనూ ప్రమాదమే..!

  • మూర్ఛలు, తలనొప్పి, ఆందోళనకు ఇదే కారణం

  • ఏపీ ‘న్యూరో సైంటిస్ట్స్‌’ వైద్య సదస్సులో వెల్లడి

గుంటూరు (మెడికల్‌), జూలై 19: మద్యపానం, ధూమపానం, గుట్కా, ఖైనీ, ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటివి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ.. మనం ప్రతిరోజూ ఉదయం పళ్లు తోమడానికి ఉపయోగించే సాధారణ టూత్‌ పేస్ట్‌లూ, తలనొప్పికి, ఒళ్లు నొప్పులకు వాడే పెయిన్‌బామ్‌లు సైతం మనిషి ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయని తెలుసా? అంటే.. అవును ఇది నిజమేనని ఆంధ్రప్రదేశ్‌ న్యూరోసైంటిస్ట్స్‌ (న్యూరాలజిస్టులు/న్యూరో సర్జన్లు) అసోసియేషన్‌ వెల్లడించింది. ఏళ్ల తరబడి టూత్‌పే్‌స్టలు వాడటం వల్ల అందులో ఉంటే మూలకాలు మూర్ఛలు, మైగ్రేన్‌, తల తిరుగుడు, ఆందోళన, భయం వంటి పలు రుగ్మతలకు కారణమవుతున్నట్టు హెచ్చరించింది. కర్పూరం, సోపు, యూకలిప్టస్‌ ఆయిల్‌, ఆయుర్వేద, హెర్బల్‌, ఇతర పేర్లతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టూత్‌పే్‌స్టలు సమస్యలు సృష్టిస్తున ్నట్లు తెలిపింది. గుంటూరులో ఆంధ్రప్రదేశ్‌ న్యూరో సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఏపీ ఎన్‌ఎ్‌సఏ) ఆధ్వర్యంలో సంఘం 31వ వార్షిక సదస్సు శుక్రవారం ప్రారంభమైంది.


తలనొప్పికి ఇదే ప్రధాన కారణం

తొలి రోజు జరిగిన సైంటిఫిక్‌ సెషన్‌లో బెంగళూరులోని సెయింట్‌ జాన్స్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ థామస్‌ మ్యాథ్యూ మాట్లాడుతూ.. తమ న్యూరాలజీ ఓపీకి వచ్చే తలనొప్పి రోగుల్లో 84 శాతం మందికి టూత్‌పే్‌స్టల వాడకమే ప్రధాన కారణమని తెలిపారు. వీరికి సాధారణ చికిత్సలు అందిస్తూనే టూత్‌పే్‌స్ట వాడకాన్ని నిలిపివేశామని, రెండు వారాల తర్వాత 99 శాతం మందిలో తలనొప్పి మాయమైందని తెలిపారు. టూత్‌పే్‌స్టలో ఉండే ఘాటైన వాసన గల మూలకాలు రోగుల్లో పలు రకాల రుగ్మతలను కల్పించే ట్రిగ్గరింగ్‌ ఫ్యాక్టర్‌గా పనిచేస్తున్నట్టు తాము గుర్తించామని డాక్టర్‌ థామస్‌ తెలిపారు. ఆయా మూలకాల ప్రభావం నేరుగా మెదడుపై పడుతుందని, దీనివల్ల తరచూ తలనొప్పి, మూర ్ఛలు, ఆందోళన, ఇతర మానసిక వ్యాధులకు దారి తీస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Jul 20 , 2024 | 05:19 AM