Share News

Yadagirigutta Temple: గుట్టలో తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్‌!

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:03 AM

తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో స్వయంభువులకు ఎదురుగా క్యూకాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు చెప్పారు.

Yadagirigutta Temple: గుట్టలో తిరుమల తరహాలో క్యూకాంప్లెక్స్‌!

  • కొండపై మందుబాబుల గుర్తింపునకు బ్రీత్‌ఎనలైజర్లు

  • యాదగిరిగుట్ట ఈవో భాస్కర్‌రావు వెల్లడి

భువనగిరి అర్బన్‌, జూలై 6: తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో స్వయంభువులకు ఎదురుగా క్యూకాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు చెప్పారు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రతీ భక్తుడికి ఇకనుంచి నిత్యం శఠగోపం, ఆశీర్వచనం అందజేస్తామని తెలిపారు. భక్తుల కోసం బస్టాండ్‌ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లును ఈ నెల 10న ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే, శ్రావణమాసంలోపు అన్నదాన సత్ర భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 14న వన మహోత్సవంలో భాగంగా 2వేల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.


15న స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం 6.05గంటలకు జరిగే గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, ఈనెల 5న కొండపైన బాత్‌రూంలో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు పడేసిన ఆకుల గణేశ్‌ అనే వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించామని ఈవో ప్రకటించారు. క్యూకాంప్లెక్స్‌లో తినుబండారాలు విక్రయించేందుకు అనుమతి పొందిన గుజ్జ శ్రీను అనే కాంట్రాక్టర్‌ వద్ద గణేశ్‌ పని చేస్తుంటాడని చెప్పారు. కాగా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు. కొండపై మద్యం సేవించిన వారిని గుర్తించేందుకు బ్రీత్‌ అనలైజర్లను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

Updated Date - Jul 07 , 2024 | 05:03 AM