Share News

CM Chandrababu: ఆ కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:28 PM

CM Chandrababu: సోలార్ పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: ఆ కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

చిత్తూరు: నారావారిపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. సోలార్ పాలసీపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు. ప్రో యాక్టివ్‌గా ఉండాలని కలెక్టర్‌కు చంద్రబాబు చురకలు అంటించారు. సోలార్ పాలసీ మీద సంబంధిత విభాగం వారికి కూడా అవగాహన లేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నారావారిపల్లి సమీపంలోని 2వేల ఇళ్లకు సోలార్ విద్యుత్ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. 2కేవీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సోలార్‌తో వినియోగదారులకు ఎదురు డబ్బు వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


కాగా.. సీఎం చంద్రబాబు ఈ ఏడాది కూడా తన స్వగ్రామైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రికే ఇక్కడకు చేరుకున్నారు. తిరుపతిలో ఆదవారం పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌, టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీఐజీ శేముషీ బాజ్‌పాయ్‌, ఇన్‌చార్జి ఎస్పీ మణికంఠ తదితరులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి 15వ తేదీ వరకూ అక్కడే ఉంటారు. సోమవారం నారావారిపల్లె అభివృద్ధికి సంబంధించిన పలు పనులకు శంకుస్థాపన చేస్తారు. మంగళవారం కూడా అక్కడే ఉండి బుధవారం మధ్యాహ్నం అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు

TTD: కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 13 , 2025 | 02:29 PM