CM Chandrababu : ఫిర్యాదుల్లో 90% భూవివాదాలే
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:23 AM
ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రజల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులపై కార్యదర్శుల సదస్సులో సమీక్షించారు.

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రజల నుంచి తీసుకుంటున్న ఫిర్యాదులపై కార్యదర్శుల సదస్సులో సమీక్షించారు. మొత్తం 7,42,301 ఫిర్యాదులు రాగా.. 90 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. అత్యధికంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి ఫిర్యాదులు అందగా, పల్నాడు జిల్లా నుంచి తక్కువగా వచ్చాయి. 2024 జూన్ 15వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 6 వరకు 7,42,301 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 4,50,735 ఫిర్యాదులను పరిష్కరించారు. ఫిర్యాదుల్లో అధికంగా గ్రామసభల నుంచి 2,36,459, రెవెన్యూ సదస్సుల నుంచి 2,34,849, కలెక్టరేట్ల నుంచి 78,169 వచ్చాయి. భూకబ్జాలపై అందిన ఫిర్యాదుల్లో 26.5%, భూ తగాదాలపై 26.5%, రెవెన్యూ రికార్డుల్లో తప్పుడు ఎంట్రీలపై 20%, పోలీసులపై పాలనాపరమైన వాటిపై 14.5%, సైబర్ క్రైమ్‌పై 12.4ు ఫిర్యాదులను పరిష్కరించారు.