Share News

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ హత్యపై డీఐజీ ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:19 PM

Pastor Praveen death investigation: పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ నెల 25వ తేదీన అనుమానాస్పద స్థితిలో ఏపీలోని రాజమండ్రి సమీపంలో మృతిచెందారు. ఈ విషయం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు.

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ హత్యపై డీఐజీ ఏం చెప్పారంటే..
Pastor Praveen death investigation

రాజమండ్రి: పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఏలూరు రేంజ్‌ డీఐజీ అశోక్‌కుమార్‌ సంచలన విషయాలను బయటపెట్టారు. ఇవాళ(శనివారం) డీఐజీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను డీఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ఈనెల 24వ తేదీన పాస్టర్‌ ప్రవీణ్‌ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలు దేరారని తెలిపారు. విజయవాడలో ప్రవీణ్‌ నాలుగు గంటలు ఆగారని చెప్పారు. విజయవాడలో ఎవరిని కలిశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఫోరెన్సిక్‌, పెథాలజీకి అన్ని వివరాలు పంపించామని డీఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు.


సీసీ కెమెరా ఫుటేజ్, పాస్టర్‌కు సంబంధించిన మొబైల్‌ డేటా సేకరిస్తున్నామని డీఐజీ అశోక్‌కుమార్‌ వివరించారు. రోడ్డుప్రమాదం జరిగిందా లేదా అనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ అశోక్‌కుమార్‌ హెచ్చరించారు. తహసీల్దార్ సమక్షంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై విచారణ చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీలు రెగ్యూలర్‌గా ఈ కేసుపై చర్చిస్తున్నారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్దకు మధ్యాహ్నం 1.30కు చేరుకున్నారని ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద సీసీ పుటేజ్‌లను ఎస్పీ నరసింహ విడుదల చేశారు.


పాస్టర్ ప్రవీణ్ మృతికి ముందు బైక్‌పై ప్రయాణిస్తున్న విజువల్స్..


ఈ వార్తలు కూడా చదవండి

AP News: కొలిక్కి రాని కొలికపూడి ఇష్యూ.. తిరువూరులో ఉత్కంఠ..

Good News To Youth: ఉద్యోగాల పండగ.. టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో సీఎం గుడ్‌న్యూస్

CM Chandrababu: ప్రజా సేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నా...

For More AP News and Telugu News

Updated Date - Mar 29 , 2025 | 05:02 PM