Share News

Kachidi Fish: వెరీ కాస్ట్లీ చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ABN , Publish Date - Feb 04 , 2025 | 08:40 AM

Kachidi Fish: కాకినాడ సముద్ర తీరంలో ఓ జాలరీకి కిచిడి చేప దొరికింది. సముద్రంలో అత్యంత అరుదుగా ఈ చేప లభిస్తుంది. ఈ చేపలు బంగారు వర్ణంలో ఉండటంతో వీటిని గోల్డెన్ ఫిష్ అని కూడా అంటారు. ఈ చేపలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.

Kachidi Fish: వెరీ కాస్ట్లీ చేప.. దీని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
Kachidi Fish

కాకినాడ: అదృష్టం కలిసి రావడం అంటే ఇదేనేమో. ఓ జాలరీపై దేవుడు కరుణ చూపించడంతో ఒక్కరోజులోనే లక్షాధికారిగా మారాడు మత్స్యకారి. రెండు మూడు సార్లు చేపల వేటకు వెళ్తే కలిసిరాని అదృష్టం ఒక్క రోజులోనే కలిసి వచ్చింది. దీంతో అతని పంట పండింది. అతను రోజూ పూజించే గంగమ్మ ఒక్కసారిగా జాలరీపై అమితమైన ప్రేమ కురిపించింది. దీంతో ఆయన పంట పండింది. వివరాల్లోకి వెళ్తే... కాకినాడలోని సముద్రతీరంలో చేపల వేటకు మత్స్యకారి వెళ్లాడు. ఆయన వేట కొనసాగించే క్రమంలో అతనికి అదృష్టంలా ఓ చేప కలిసి వచ్చింది. జాలరీ వలలో అత్యంత అరుదైన కచిడి చేప పడింది. చేప దొరికిందే అనువుగా ఆ చేపను తీసుకెళ్లి కుంభాభిషేకం రేవులో వేలం పెట్టాడు. కచిడి చేప ఏకంగా రూ. 3లక్షల 95వేల ధర పలికింది.


ఎన్నో ఔషధ గుణాలు..

తాను వల వేస్తే అత్యంత ఖరీదైన చేప తనకు పడుతుందని అతనికి కూడా తెలియదేమో. కానీ ఎన్నిసార్లు వేటకు వెళ్లినా కలిసి రాని అదృష్టం తలుపు తట్టడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ కచిడి చేపకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. సముద్రపు నీటిలో చాలా తక్కువగా దొరికే ఈ కచిడీ చేపను మత్స్యకారులు గోల్డెన్ ఫిష్‌గా పిలుస్తారు. సాధారణ చేపల మాదిరిగా గాకుండా త్వరగా జాలర్ల వలలో ఇవి పడవు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కచిడి చేపలు అరుదుగా ఉంటాయి. ఈ చేపల్లో మగ కచిడీ చేపలు బంగారు వర్ణంలో మెరుస్తాయి.


మార్కెల్లో భారీ ధర..

ఈ చేప మాంసం ఎంతో రుచిగా ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని కొనడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కచిడి చేపకు మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ చేపలో. అలాగే వైద్యులు ఏదైనా చికిత్స చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని కూడా దీని నుంచే సేకరిస్తారు. ఈ చేప పొట్టభాగం నుంచి తయారుచేసే దారం ఆ తర్వాత శరీరంలో క్రమంగా కలిసి పోతుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేపను ఉపయోగిస్తారు. అందుకే ఈ కచిడి చేపకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Arasavalli.. శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు

Rathasaptami .. తిరుమల, అరసవల్లిలో రథసప్తమి వేడుకలు..

Nandamuri Balakrishna : ఎన్టీఆర్‌కు భారతరత్న... అందరి కోరిక: బాలకృష్ణ

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 04 , 2025 | 11:01 AM